తెలంగాణలో రాబోయేది ప్రజాశాంతి పార్టీ ప్రభుత్వం అని.. నేను తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించారు కేఏ పాల్. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కెసిఆర్ మోసం చేశాడు..తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు రావాలి పాలన మారాలని.. దేవుడి ఆత్మ నాలో మాట్లాడుతూ ఉందని చెప్పారు.
ఏపీలో టిడిపి ,వైసిపిలు లక్షల కోట్లు ఖర్చు చేసి ఒక రాజధాని నిర్మించలేకపోయారు..చంద్రబాబు జగన్ కి..జగన్ బిజెపికి సరెండర్ అయిపోయారని ఆగ్రహించారు. జగన్ ప్రభుత్వంలో ఏపీ అప్పుల పాలయింది..ప్రస్తుతం అప్పులు దొరకని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.
రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం జగన్, కేసీఆర్ నాతో చేతులు కలపాలి..రాష్ట్రం శ్రీలంక కాకుండా ఉండాలంటే.. అప్పులు తీరాలంటే ప్రజాశాంతి పార్టీని ఆదరించండని కోరారు. పవన్ కళ్యాణ్ కి నేనంటే చాలా గౌరవం..పవన్ కళ్యాణ్ కి వంద సార్లు ఆఫర్ ఇచ్చా.. ప్రజాశాంతి పార్టీలోకి రమ్మని అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్.