అక్టోబర్ 2 న జింఖాన గ్రౌండ్ లో ప్రపంచ శాంతి సమావేశం నిర్వహిస్తున్నట్లు కే ఏ పాల్ ప్రకటించారు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కూడా అందర్నీ ఆహ్వానించారని.. 28 మంది ప్రధానులు రానున్నట్లు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. వరుణ్ గాంధీని ఆహ్వానించాము..వరుణ్ గాంధీ ని రావద్దని కేటీఆర్ చెప్పారట.. స్వయంగా వరుణ్ గాంధీ చెప్తున్నారని ఫైర్ అయ్యారు.
ప్రశాంత్ కిశోర్ పొలిటికల్ ప్రాసిట్యూటర్ అని… కాంగ్రెస్ ను వీక్ చేయడానికి కేసీఆర్ ను వాడుకుంటున్నారని మండిపడ్డారు. మా శాంతి సభను కేసీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. శాంతి సభను అడ్డుకునే వాళ్ళు, దేవుడి శాపానికి గురవుతున్నారని నిప్పులు చెరిగారు.
శాంతి సభ ను అడ్డుకునే వాళ్ళు దేశ, రాష్ట్ర ద్రోహులు అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ ను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశానని.. మునుగొడులో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో నాకు ఓటర్ ఐడి కార్డు ఇప్పించాలని కోరానని కేఏ పాల్ తెలిపారు.