దైవసేవకుడిగా పేరున్న కే ఏ పాల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ప్రజాశాంతి పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి ప్రజలకు ఉత్తమమైన పాలనను అందించడానికి కృషిచేస్తున్నాడు. తాజాగా ఈయన రాజమండ్రి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జనసేన పార్టీపైన దారుణమైన వ్యాఖ్యలు చేశారు. నేను ముందు నుండి చెబుతున్నాను , ప్రజల కోసం ఏ పార్టీలు ఉన్నాయి , ప్రజలను మోసం చేయడానికి ఏ పార్టీలు ఉన్నాయని … ఇప్పుడు జరిగే పరిణామాలు చూస్తుంటే మీకే అర్ధమవుతుంది అంటూ కే ఏ పాల్ కామెంట్ చేశారు. అస్సలు పవన్ స్థాపించిన జనసేన పార్టీలో సిగ్గున్న ఏ నాయకుడు ? లేదా కార్యకర్త అయినా చేరుతారా అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు కే ఏ పాల్. ఇంకా పాల్ మాట్లాడుతూ ఈ విషయంపైన చిరంజీవి, నాగబాబు మరియు పవన్ కళ్యాణ్ లతో ఓపెన్ గా డెబిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ సవాలు విసిరాడు.
సిగ్గున్న వారు ఎవరైనా జనసేనలో చేరుతారా ? : కే ఏ పాల్
-