Kaathuvaakula Rendu Kaadhal : సమంత కొత్త మూవీ షూటింగ్ ఫినిష్..!

-

అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకుల ఎపిసోడ్ అనంతరం.. సమంత ఏం చేసినా వైరల్ గా మారుతుంది. అంతేకాదు వీళ్ళిద్దరి ఎపిసోడు.. మీడియాను ఫుల్ బిజీ చేసేస్తుంది. అయితే విడాకుల అనంతరం హీరోయిన్ సమంత పలు సినిమాల్లో నటిస్తోంది. విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి సమంత నటించిన తాజా కోలీవుడ్ మల్టీస్టారర్ మూవీ “కాతువాకుల రెండు కాదల్”.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో విజయ్ రాంబో గా కనిపించగా హీరోయిన్ సమంత మాత్రం ఖతియా గా కనిపించింది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను రౌడీ పిక్చర్స్ బ్యానర్ తో కలిసి 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ ఈ సంగీత స్వరాలు అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం సంబరాలు జరుపుకుంది. దీనికోసం సమంత నిన్న ముంబై వెళ్ళింది. దీనికి సంభందించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. కాగా ఏప్రిల్ 18 న ఈ మూవీ విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version