కేసీఆర్ ను ఒక్క మాట కూడా తిట్టను.. ఆయన అవకాశాలు ఇచ్చారన్నారు కడియం శ్రీహరి. ఇవాళ కడియం శ్రీహరి మాట్లాడుతూ…బీఆర్ఎస్ పార్టీని వీడడం కొంత బాధగానే ఉంది…కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం ఉంది.. కేసీఆర్ గారిపై నేను ఏ రకమైన విమర్శలు చేయదలచుకోలేదని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ నాకు అవకాశాలు ఇచ్చింది.. నేను ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకున్నాను అని గుర్తు చేశారు కడియం శ్రీ హరి.
ఎఐసిసి ప్రతినిధుల పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాము…వరంగల్ నుంచి కడియం కావ్యకి పోటీ చేసే అవకాశం కల్పించిన సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అని చెప్పారు. మాపై ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడించారు. 10 ఏళ్ల అధికారం లో ఉన్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తుంది..ప్రజాస్వామ్య బద్ధంగా గెలుపొందిన ప్రభుత్వాలనుకూలదోష కుట్ర బీజేపీ చేస్తుందని పేర్కొన్నారు కడియం శ్రీ హరి.