పెళ్లి కబురుతో అభిమానులకు షాకిచ్చిన కాజల్ అగర్వాల్ తాజాగా మరో షాకిచ్చింది. సినిమాల్లో బిజీగా వున్న కాజల్ డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో `లైవ్ టెలీకాస్ట్` పేరుతో రూపొందుతున్న వెబ్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. హారర్ అంశాల ప్రధానంగా సాగే ఈ వెబ్ సిరీస్‌లో కాజల్ దెయ్యంగా కనిపించబోతోంది.
దెయ్యం లుక్‌లో కనిపిస్తున్న తన పోస్టర్‌ని సోషల్ మీడియా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. గ్లామర్ పాత్రలతో హొయలు పోయిన కాజల్ `లైవ్ టెలీకాస్ట్` తో తనలోని సరికొత్త యాంగిల్‌ని చూపించబోతోంది. తమిళంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వుంది. ఈ వెబ్ సిరీస్‌తో కాజల్ ఎలా ఏ స్థాయిలో భయపెడుతుందో చూడాలి.