కాకాణి : మ‌ళ్లీ మీడియాపై నోరు పారేసుకున్నాడే !

-

పంట‌ల బీమాకు సంబంధించి యెల్లో మీడియా రాత‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని చెబుతూ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి, నెల్లూరు పెద్దాయ‌న కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి కీలక వ్యాఖ్యాలు చేశారు. యెల్లో మీడియా మేథావుల‌కు వంద‌నం అంటూ త‌న‌దైన శైలిలో మాట్లాడారు. ఎందుకింత అస‌హ‌నం ? అని ఆయ‌న్ను అడిగితే.. తాము రైతుల ప్రీమియం చెల్లిస్తూ, త‌రువాత బీమా వ‌ర్తింపు చేస్తున్నా అస‌త్య క‌థ‌నాలు వండి వారుస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

ఇవ‌న్నీ బాగున్నాయి..ఏటా మూడు వేల కోట్ల రూపాయ‌లు బీమాకే చెల్లిస్త‌న్నామ‌ని చెబుతున్నారే మ‌రి! అందులో కౌలు రైతుల‌కు అందేది ఎంత‌? అన్న ప్ర‌శ్న కూడా వినిపిస్తోంది. దీనిపై కూడా మంత్రి మాట్లాడితే మిగిలిన విష‌యాల్లో పార‌దర్శ‌క‌త ఎంత ? లేదా రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ఈ ప్ర‌భుత్వానికి ఉన్న విజ‌న్ ఎంత ? అన్న‌ది తేలిపోతుంది.

ఇదే సంద‌ర్భంలో చంద్ర‌బాబును ఉద్దేశించి కూడా కొన్ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారాయ‌న. గ‌త ప్ర‌భుత్వం రైతులకు చెల్లించాల్సిన బ‌కాయిలు కూడా తామే చెల్లించామ‌ని అంటున్నారీయ‌న. ఇదంతా ప్ర‌భుత్వ వాద‌న కానీ రైతు వాద‌న మ‌రోలా ఉంది. అస‌లు క‌నీసం కాలువ‌ల పూడిక‌ల‌కు కూడా నిధులు కేటాయించ‌కుండా, క‌నీసం పంట‌ల కాలువ‌ల నిర్వ‌హ‌ణ‌కు కూడా దృష్టి కేంద్రీకృతం చేయ‌కుండా ఇంత అవాస్త‌వాలు ఎలా మాట్లాడ‌తార‌ని ప్ర‌శ్నిస్తున్నాయి. వీలున్నంత వ‌ర‌కూ రైతుల‌నే కాదు కౌలు రైతుల‌నూ ఆదుకోవాల్సిన బాధ్య‌త  ప్ర‌భుత్వం ఉంది.

ఇక్క‌డ ఏటా ధాన్యం కొనుగోలే కాదు ఖ‌రీఫ్ ఆరంభ ద‌శ నుంచే ఇబ్బందులు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో రైతుల‌తో క‌లిసి ప‌ర్య‌టిస్తే నిజాలు తెలుస్తాయి అన్న‌ది విప‌క్షాల వాద‌న. కానీ ఇవేవీ ప‌ట్టించుకోకుండా త‌మనూ, అదే విధంగా మీడియాను తిట్ట‌డం స‌మంజ‌సం కాద‌ని హిత‌వు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version