కాంగ్రెస్ పార్టీకి చరిత్ర తప్ప భవిష్యత్తు లేదు: కేటీఆర్

-

కాంగ్రెస్ పార్టీకి చరిత్ర తప్ప భవిష్యత్తు లేదని అన్నారు మంత్రి కేటీఆర్. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…”ఇటీవల కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వరంగల్ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అంటున్నాడని,ఒక్క అవకాశం ఇస్తే తెలంగాణ రైతుల రూపురేఖలు మార్చేస్తా అంటున్నాడని వెల్లడించారు.

రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్నా అడిగేవాడే లేడు. ఎక్కడా చడీ చప్పుడు లేదు. అట్లాంటి స్థితిలో ఉన్న దౌర్భాగ్యపు కాంగ్రెస్ పార్టీ, చావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ను ఉద్ధరిస్తుంది అంటే ఎట్లా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? గత అనుభవాలు లేవా? ప్రజలు దీనిపై ఒకసారి ఆలోచించాలి.” అంటూ కేటీఆర్ ప్రసంగించారు.కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ ఎన్ని మాటలు చెప్పినా ఒక మాట మాత్రం నిజం అని, కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాలం చెల్లిన మందుల లాంటిది. భూమి పుట్టినప్పుడు పుట్టింది కాంగ్రెస్ పార్టీ. చరిత్ర తప్ప ఎక్కడ వాళ్లకు భవిష్యత్ లేదని.. ఇంకే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version