హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియోలు కాస్త వైరల్ గా మారాయి. దాంతో మోటార్ వాహనాల చట్టనిబంధనలు సక్రమంగా అమలు చేయడం లేదని ఇటీవల అగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. హెల్మెట్ తప్పనిసరి చేస్తూ తాము ఇచ్చిన ఆదేశాలు ఎందుకు పాటించడం లేదని ట్రాఫిక్ పోలీసులను ప్రశ్నించింది కోర్టు. ఓ ప్రజా ప్రతినిధిగా ఉంటూ ఎంపీ నిబంధనలు పాటించకపోవడం ఏంటి అంటూ ఉదయ్ శ్రీనివాస్ పై విమర్శలు గుప్పించింది.
అయితే ఎంపీ ముందు వెనక కార్లతో హడావిడి చేస్తూ బుల్లెట్ నడుపుతున్నట్లు వీడియోలో ఉంది. పైగా ఎంపీ బైక్ విన్యాసాల కోసం ట్రాఫిక్ ను ఆపేసారు పోలీసులు. దీంతో ఎంపీగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సింది పోయి సర్కస్ ఫీట్లు ఏంటి అని విమర్శలు చేసింది కోర్టు. అలాగే హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్న ఎంపీ కోసం పోలీసులు ట్రాఫిక్ ను ఎలా ఆపారు అని ప్రశ్నించింది.