మాజీ ఈఎన్సీ మురళీధర్ పై అసహనం వ్యక్తం చేసారు కాళేశ్వరం కమిషన్ చీఫ్. కమిషన్ అడిగిన ప్రశ్నలకు మౌనంగా ఉంటూ …గుర్తుకులేదనే సమాధానం చెప్పారు మురళీధర్ రావు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు జవాబు గుర్తుకులేదు, జ్ఞాపకశక్తి మందగించిందన్నారు మురళీధర్ రావు. జ్ఞాపకశక్తి తిరిగి రావాలంటే పుస్తకాలు ఎక్కువగా చదవాలని సూచించారు కమిషన్ చీఫ్. దానికి డైలీ న్యూస్ పేపర్స్ చదువుతున్నానని, పుస్తకాలు చదవలేనన్నారు మురళీధర్.
అయితే పనులను చేయడానికి ఎవరి ఆదేశాలు అమలు చేశారన్న కమిషన్ ప్రశ్నకు.. ప్రభుత్వం ఆదేశాల మేరకని సమాధానం చెప్పారు మురళీధర్ రావు. ప్రభుత్వం అంటే మీ దృష్టిలో ఎవరని కమిషన్ ప్రశ్నించగా.. ప్రభుత్వం అంటే నా దృష్టిలో సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ అని సమాధానమిచారు మురళీధర్ రావు. ఇక ప్రభుత్వం అంటే అధికారులా.. రాజ్యాంగం అని తెలీదా, పరిజ్ఞానం లేదా, ప్రభుత్వ ఉద్యోగం చేశావు కదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది కమిషన్.