మోడీ ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత సీరియస్‌….

-

మోడీ ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత సీరియస్‌ అయ్యారు. భారత దేశంలో నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉంది, ఇది మూడు నెలల గరిష్ట స్థాయి అని కల్వకుంట్ల కవిత అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైంది ? మోసపూరిత హామీతో యువతను కూడా దగా చేస్తిరి కదా !! అని విమర్శలు చేశారు.

కేంద్రంలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు ? అసలు వాటిని భర్తీ చేసే ఉద్దేశం కనిపించడం లేదన్నారు కల్వకుంట్ల కవిత. ఈరోజు భారతదేశంలో వాస్తవం ఏంటంటే – నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవు కానీ డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం ఉందని తెలిపారు. యువత పట్ల ఏమైనా ఆందోళన ఉందా లేదా యువత శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుని కృషి ఏమైనా చేస్తున్నారా ? అని ప్రశ్నించారు కల్వకుంట్ల కవిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version