కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, ఆర్యవైశ్య చైర్ పర్సన్ కాల్వ సుజాత సంచలన వీడియో విడుదల చేశారు. తన ఫోన్ హ్యాక్ అయినట్లు ఆమె తాజాగా వెల్లడించారు. వరుస ఫోన్ హ్యాకులతో కాంగ్రెస్ నేతలు గుబులు చెందుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆర్యవైశ్య చైర్ పర్సన్ కాల్వ సుజాత సంచలన వీడియో పెట్టారు. తన ఫోన్ హ్యాక్ అయిందని… తన పేరుతో చాలా మంది డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

ఫేస్బుక్ అలాగే వాట్స్అప్ హ్యాక్ చేసి డబ్బులు అడుగుతున్నారని ఆమె వివరణ ఇచ్చారు. కాబట్టి ఎవరూ కూడా తన పేరుతో వచ్చే ఫోన్లకు రెస్పాండ్ కాకూడదని.. చెప్పారట. డబ్బులు అనవసరంగా పంపి మోసపోకూడదని రిక్వెస్ట్ చేశారు. ఇక అటు స్పోర్ట్స్ అథారిటీ చైర్పర్సన్ శివసేన రెడ్డి ఫోన్ కూడా హ్యాక్ అయింది. ఈ మేరకు హాక్ అయినట్లు ఆయన వీడియో విడుదల చేసి ఎవరు మోసపోకూడదని వెల్లడించారు.
నా ఫోన్ హ్యాక్ అయింది
వరుస ఫోన్ హ్యాక్లతో గుబులు చెందుతున్న కాంగ్రెస్ నాయకులు
నా ఫోన్ హ్యాక్ అయింది.. ఫేస్బుక్, వాట్సాప్ హ్యాక్ చేసి డబ్బులు అడుగుతున్నారు – టీపీసీసీ స్పోక్స్ పర్సన్, ఆర్యవైశ్య చైర్పర్సన్ కాల్వ సుజాత https://t.co/A9aS4rkoiC pic.twitter.com/D4IBcZmqz4
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2025