ఎంపీ పోతేనేం ఎమ్మెల్సీ వుందిగా!

-

తెలంగాణ‌లో త్వ‌ర‌లో ఎమ్మెల్సి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల వేళ తెలంగాణ సీఎం, గులాబీ ద‌ళ‌ప‌తి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు త‌న కూతురు కల్వ‌కుంట్ల క‌విత అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. నిజామాబాద్ ఎంపీ ఎన్నిక‌ల్లో త‌న స్థానాన్ని కోల్పోయిన క‌ల్వ‌కుంట్ల క‌విత గ‌త కొంత కాలంగా ఎలాంటి ప‌ద‌వీ బాధ్య‌త‌లు లేకుండా రాజ‌కీయాల్లో సైలెంట్ అయిపోయారు.

దీంతో ఆమెని స్థానికి సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దింపాల‌ని తెరాస అధినాయ‌క‌త్వం భావిస్తోంద‌ట‌. ఇప్ప‌టికే ఆమె పేరుని ఖ‌రారు చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నిజామ‌బాద్ నుంచి క‌విత ఎన్నిక లాంఛ‌న‌మే అంటున్నాయి పార్టీ వ‌ర్గాలు. కార‌ణం స్థానికంగా వున్న శాస‌న స‌భ్యులంతా తెరాస‌కు చెందిన వారు కావ‌డ‌మే. ఈ అంశాన్ని ప్ల‌స్‌గా మార్చుకుని క‌విత‌ని ఎమ్మెల్సీగా మండ‌లికి తీసుకురావాల‌న్న‌ది తెరాస ప్లాన్. ఈ ప్లాన్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యేలా క‌నిపిస్తోంది.

అక్టోబ‌ర్ 9న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 12న ఓట్ల లెక్కింపు జ‌ర‌గుతుంది. 14వ తేదీని ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప్ర‌క్రియ ముగుస్తుంద‌ని ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. 2016లో తెరాస నుంచి ఎమ్మెల్సీగా భూప‌తి రెడ్డి పోటీచేసి గెలిచారు. అయితే ఆ త‌రువాత ఆయ‌న కాంగ్రెస్ గూటికి చేర‌డంతో ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు ప‌డింది. దీంతో అక్క‌డ ఎన్నిక అనివార్య‌మైంది. ఆ ప్లేస్‌లో క‌విత‌ని ఎమ్మెల్సిగా నిల‌బెడుతోంది తెరాస. దీంతో ఆమె ఎన్నిక ఇక న‌ల్లేరు మీద న‌డ‌కే అంటున్నాచి తెరాస వర్గాలు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version