ఎలుకకు గోల్డ్ మెడల్..!

-

ఓ ఎలుక గోల్డ్ మెడల్ సాధించింది. కాంబోడియాలోని ఓ ఎలుకకు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ పతకం పేరు ‘పీడీఎస్ఏ’ గోల్డ్ మెడల్. ఇప్పటివరకు ఈ మెడల్‌ను 30 జంతువులకు ఇచ్చారు. కానీ గోల్డ్ మెడల్ గెలుచుకున్న మొదటి ఎలుక ఇదే కావడం విశేషం. ఎలుక జాతికే ఆణిముత్యంలా నిలిచి చరిత్ర సృష్టించిన ఈ ఎలుక పేరు ‘మగావా’. ఆఫ్రికాకు చెందిన ఈ ఎలుక పోలీస్ జాగిలాల లాగా గొప్ప పని చేసింది.

కాంబోడియాలోని భూముల్లో దుండగులు పాతిపెట్టిన లాండ్‌మైన్లను కనిపెట్టడంలో ఈ ఎలుక అత్యంత ప్రతిభ కనబరిచింది. ఏడేళ్లలో ఏకంగా మగావా 39 ల్యాండ్‌మైన్లు, 28 పేలుడు పదార్థాలను కనిపెట్టింది. మనుషుల ప్రాణాలు కాపాడటంలో సేవలందించిన మగావాను బంగారు పతకంతో సత్కరించారు. మగావా ఎలుక వయసు ఇప్పుడు 7 ఏళ్లు. బెల్జియం దేశానికి చెందిన అపోపో చారిటీ సంస్థ ఎలుకలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. 1990ల నుంచి ఈ సంస్థ ఎలుకలను ట్రైన్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version