బతుకమ్మ పాటలపై కల్వకుంట్ల కవిత ఆసక్తి కర వ్యాఖ్యలు

-

ఇవాళ తెలుగు యూనివర్సిటీ లో బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్‌ తమిళ్‌ సై తో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ పాటల లో ఉండే తెలుగు పదాల మీద పరిశోధన చేస్తే, తెలుగు బాష మరింత పరిపుష్టం అవుతుందని… తెలంగాణ జాగృతి తో పాటు, అనేక సంస్థలు బతుకమ్మ పండుగకు సంబంధించి పాత పాటలు సేకరిస్తున్నారని వెల్లడించారు.

పాత బతుకమ్మ పాటల్లో ఉండే పదాల మీద ప్రత్యేక అధ్యయనం చేసిన ట్లైతే, మనం మరచిన తెలుగు పదాలు, తెలంగాణ పదాలు, మళ్లీ బాషలో చేరే అవకాశం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. బతుకమ్మ పండుగ మీద అనేక మంది పరిశోధనలు చేస్తున్నారని… గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ప్రతి రోజు రాజ్ భవన్ లో బతుకమ్మ పండుగ జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వం తరుపున ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు ఎమ్మెల్సీ కవిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version