నిలిచిన కళ్యాణలక్ష్మి చెక్కులు.. ప్రభుత్వానికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే వార్నింగ్!

-

కళ్యాణ లక్ష్మి లబ్దిదారులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదని కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం ‘ఎక్స్’ వేదికగా వీడియో సందేశం విడుదల చేశారు. కూకట్ పల్లి సెగ్మెంట్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఆగిపోవడంపై ఆయన స్పందిస్తూ.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వచ్చి నెల రోజులు అయ్యిందని, 550 మంది లబ్ధిదారులకు చెక్కులు నిలిపివేయడం దుర్మార్గమని అన్నారు.

చెక్కుల కోసం లబ్దిదారులు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, తాను అధికారులను రిక్వెస్ట్ చేస్తే మంత్రి వచ్చాక ఆయన చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేస్తామని చెబుతున్నారని సీరియస్ అయ్యారు. ఆనవాయితీ ప్రకారం చెక్కులు ఎమ్మెల్యేలే పంపిణీ చేస్తారని కానీ, ప్రభుత్వ అధికారులు మంత్రి వస్తేనే పంపిణీ అని చెప్పడం దారుణం అన్నారు. నెల రోజులుగా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ‌కు పలుమార్లు ఫోన్ చేసినా మంత్రి వస్తేనే పంపిణీ అనే జవాబివ్వడం సరికాదన్నారు. మంగళవారం ఉదయం 11 గంటల వరకు లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేయకపోతే ఎంఆర్ఓ ఆఫీసు వద్ద ధర్నా చేస్తామని కృష్ణారావు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news