క‌ర్క‌శంగా కన్న త‌ల్లిని నడిరోడ్డుపై వ‌దిలేసిన కొడుకులు

-

కనీ పెంచిన తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి కన్న కొడుకులు గాలికి వదిలేశారు. బుక్కెడు బువ్వ పెట్టి ఇంట్లో ఉంచుకోవడానికి కనికరం చూపలేదు. నడిరోడ్డుపై ఆమెను వదిలేశారు. ఏపీలోని ప్ర‌కాశం జిల్లా య‌ర్ర‌గొండ‌పాళెంలో ఈ హృద‌యవిదార‌క ఘ‌ట‌న‌ సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానికుల కథనం ప్రకారం.. రెండు రోజుల కిందట యర్రగొండపాలెం స్థానిక ప్ర‌భుత్వ ఆసుప‌త్రి ఆంజనేయ‌స్వామి గుడి వ‌ద్ద త‌మ త‌ల్లిని కొడుకులు వ‌దిలేసి వెళ్లిపోయారు. పైకి లేవ‌లేక‌, క‌నీసం చుట్టుప‌క్క‌ల వారు ఇచ్చే ఆహారం కూడా తిన‌లేని స్థితిలో వృద్ధురాలు దీనావస్థలో ఉండిపోయింది. అధికారులు వెంటనే స్పందించి ఆ తల్లిని వృద్ధాశ్ర‌మానికి త‌ర‌లించాల‌ని స్థానికులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news