శాండిల్ వుడ్ ఆఫర్ కొట్టేసిన కళ్యాణి ప్రియదర్శన్.. హీరో ఎవరంటే..?

-

చాలామంది సినీ ఇండస్ట్రీలో వారసుల పిల్లలు హీరోలుగా, హీరోయిన్ లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎంతమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు . మరి కొంతమంది అడపా దడపా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ లో సినీ బ్యాక్ గ్రౌండ్ కలిగిన కుటుంబాల నుంచి వచ్చిన హీరోయిన్ల విషయంలో ప్రస్తుతం ఇదే జరుగుతుంది. కొంతమంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలకే దూరమైతే మరికొంతమంది ఆల్రౌండర్ అనిపించుకుంటున్నారు. ఇక శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, కీర్తి సురేష్ , కళ్యాణి ప్రియదర్శన్ తదితరులు సెలబ్రిటీల వారసురాళ్లే కావడం గమనార్హం.

ముఖ్యంగా వారసుల పిల్లలకు అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా తోడైతేనే వారు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతారు. ఇకపోతే నటి కళ్యాణి ప్రియదర్శన్ విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ , నటి లిజీ దంపతుల వారసురాలు ఈమె అని చెప్పవచ్చు ..అయితే వీరిద్దరూ చాలా కాలం క్రితమే విడిపోయారు. ప్రస్తుతం తల్లి దగ్గరే ఉంటున్న కళ్యాణి ప్రియదర్శన్ కథానాయకగా రంగప్రవేశం చేసి.. తెలుగు, తమిళ్ ,మలయాళం భాషల్లో నటిస్తోంది. మొదట్లో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్ .. ఆ తర్వాత తమిళ్ , మలయాళం భాషల్లో ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. కన్నడ కంఠీరవ రాజకుమార్ మనవడు రాఘవేంద్ర రాజకుమార్ కొడుకు యువరాజ్ కుమార్ హీరోగా సినీ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయనకు జోడిగా కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు తాజా సమాచారం . ఈ సినిమాలో కూడా ఈమె నటిస్తే ఇప్పుడు సౌత్ ఇండియన్ ఆల్ రౌండర్ కొట్టేసినట్లే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version