పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చెయ్యాలనుకుంటున్నారా..? వెంటనే డబ్బులు పడాలంటే ఇలా చెయ్యండి..!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వివిధ రకాల సేవలని అందిస్తోంది. అలానే ఈ బ్యాలెన్స్‌ని ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా ఉపసంహరించుకోవచ్చు. ఈ డబ్బులని తీసుకోవాలని అనుకుంటే EPFO e-SEWA పోర్టల్ ద్వారా తీసుకో వచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులు ఇలా ఈజీగా డబ్బులని తీసుకోవచ్చు. పదవీ విరమణ చేసిన తర్వాత కానీ అత్యవసర సమయాల్లో PFలో డబ్బును డ్రా చేసుకోవచ్చు. కాస్త అమౌంట్ ని కానీ పీఎఫ్ మొత్తాన్ని కానీ విత్‌డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ ఉపసంహరణ విషయంలో మనకు సందేహాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఎలా డబ్బులని డ్రా చేసుకోవచ్చు అనేది చూద్దాం.

దీని కోసం ముందు మీరు EPFO పోర్టల్‌లో లాగిన్‌ అవ్వండి.
తర్వాత మీ UAN, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చెయ్యండి.
నెక్స్ట్ క్యాప్చాను ఎంటర్ చేయండి.
ఇప్పుడు ఆన్‌లైన్ సర్వీసెస్’ ట్యాబ్‌ కి వెళ్ళాక.. డ్రాప్-డౌన్ మెను నుంచి ‘క్లెయిమ్ (ఫారం 19, 31, 10C లేదా 10D)’ ని ఎంచుకోండి.
ఆ తరవాత బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఎంటర్ చేసేయండి. ఆ తరవాత ‘వెరిఫై’పై క్లిక్ చేయండి. నెక్స్ట్ అవునుపై క్లిక్ చెయ్యండి.
ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్ పై నొక్కండి. అలానే క్లెయిమ్ ఫారమ్‌లో ‘నేను దరఖాస్తు చేయాలనుకుంటున్నాను’ అనే దాన్ని ఎంపిక చేసుకోండి.
డబ్బులు తీసుకోవడానికి PF అడ్వాన్స్ (ఫారం 31) ని సెలెక్ట్ చేసుకోండి.
అవసరమైన మొత్తంని ఎంపిక చేసుకోండి.
ఉద్యోగి చిరునామాను నమోదు చేయండి.
సర్టిఫికేట్‌పై క్లిక్ చేసి మీ దరఖాస్తును సమర్పించండి.
ఫారమ్‌ను ఫిల్ చేసేసాక స్కాన్ చేసిన పత్రాలను సబ్మిట్ చేయండి.
చందాదారుడి ఉపసంహరణ అభ్యర్థనను ఆమోదించిన తర్వాత రెండు మూడు రోజుల్లోనే డబ్బులు వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version