Kamal Hasan: కమల్ హాసన్‌ థగ్‌ లైఫ్ షూటింగ్ ప్రారంభం…

-

మణిరత్నం దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’ . థగ్‌ లైఫ్‌ మొదటి రోజు షూటింగ్‌ ప్రారంభం అయింది. దీనికి సంబంధించిన వీడియోలు మేకప్స్ ఈరోజు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.దుల్కర్ సల్మాన్‌, త్రిష, జయం రవి,ఐశ్వర్యలక్ష్మి, గౌతమ్‌ కార్తీక్‌, జోజు జార్జ్‌ అండ్ టీంతో మేకర్స్‌ డిజైన్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుంది.ఆస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు . థగ్‌ లైఫ్ చిత్రాన్ని కమల్ హాసన్‌-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌, మద్రాస్ టాకీస్‌,రెడ్ జియాంట్ మూవీస్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అంతేకాకుండా కమల్ హాసన్ ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న కల్కి 2898 ఏడీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.వినోథ్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ హీరోగా KH233లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version