కమలా హ్యరీస్ అమెరికాకు తొలి ప్రెసిడెంట్ కావొచ్చు : కేటీఆర్

-

న‌వంబ‌ర్‌లో జరిగే అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రెండు ప్ర‌ధాన పార్టీలైన డెమెక్రటిక్, రిపబ్లికన్ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నాయి. వ‌రుస‌గా రెండోసారి గెలిచి అధికారం దక్కించుకోవాలని డెమొక్రాట్లు భావిస్తుంటే.. 2020లో చేజారిన అధికారాన్ని తిరిగి సాధించాల‌ని రిపబ్లికన్లు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌, కమలా హ్యారిస్ బుధ‌వారం తొలి డిబేట్‌లో పాల్గొన్నారు.ట్రంప్‌తో జరిగిన ఈ ముఖాముఖి చర్చలో కమలా గట్టిగా బ‌దులిచ్చారు.

Key statement of KTR on Zainur incident

ఇలా ఈ డిబేట్‌లో ట్రంప్‌పై ఆమె చేసిన ఎదురుదాడిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.కమలా నిజమైన అధ్యక్ష అభ్యర్థి అంటూ పొగిడారు.ఈ మేరకు’ఎక్స్'(ట్విట్ట‌ర్) వేదికగా ఆస‌క్తిక‌ర పోస్ట్‌ చేశారు.‘కమలా నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి అనిపించారు. ఈ సంవత్సరం చివర్లో అమెరికాకు ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు కావచ్చు’ అని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం కేటీఆర్ ట్వీట్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version