ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన పై పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టబోతున్నాడు. ఈరోజు రాత్రి 7 గంటలకు అల్లు అర్జున్ తన ఇంట్లోనే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కామెంట్స్ చేసిన తర్వాత… ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టడంతో ఆసక్తి నెలకొంది.
హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగింది. ఈ విషయాన్ని హీరోకు ఏసీపీ చెప్పినా… శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పినా హీరో వినలేదు. బయటకు వెళ్లడానికి హీరో ఒప్పుకోలేదని సిటీ కమిషనర్ చెప్పారు. దీంతో డీసీపీ వెళ్లి అక్కడ నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను కారు ఎక్కించారు. అయినా వెళ్ళేటప్పుడు కూడా కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్లారు. ఈ నేపథ్యంలో హీరోపై, యాజమాన్యం పై పోలీసులు కేసు పెట్టారు. బాధ్యత రహితంగా సమాధానాలు ఇవ్వడం వల్లే పోలీసులు వారి విధి నిర్వహించారు అని రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.