ఈరోజు సీఎం తీరు గజ్జెల లాగు వేసుకొని కొరడాతో తనని తానే కొట్టుకున్నట్లు ఉంది అని హరీష్ రావు అన్నారు. సీఎం కాబట్టి మైక్ దొరికింది అని మాట్లాడారు. కానీ మాకు మాత్రం మైక్ ఇవ్వ నివ్వలేదు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాల్లో గిన్నిస్ బుక్ రికార్డ్ లోకి ఎక్కుతారు. ఈ ఐదారు రోజుల్లో ప్రభుత్వం సభలో తేలిపోయింది. 2 గంటల ప్రసంగం లో అన్ని అబద్ధాలు మాట్లాడారు.
ఫార్మా సిటీ లో విలువైన భూములు సేకరించి.. అగ్గువ కు కంపెనీల కు ఇచ్చాము అన్నారు. ఒక్క కంపెనీ కి కూడా ఇవ్వలేదు.. ఇంకా తక్కువ కు ఇవ్వడం ఎలా ఉంటుంది. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని సవాలు విసిరాను. రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా పై క్లారిటీ ఇవ్వలేదు. slbcని BRS ఒక్క కిలోమీటర్ కూడా తవ్వలేదు అన్నారు. మేము 11 కిలోమీటర్ల కు పైగా slbcని తవ్వాము అని హరీష్ రావు స్పష్టం చేసారు.