శభాష్ కమల్ హాసన్ .. రజినీకాంత్ కూడా చెయ్యలేనిది చేశాడు !

-

చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పుడు మరణ కేకలు వినబడుతున్నాయి. యూరప్ మరియు అమెరికా దేశాలలో కరోనా వైరస్ రోజురోజుకి చాలా భయంకరంగా ప్రబలుతుంది. దీంతో ప్రధాని మోడీ 21 రోజుల పాటు ఇండియాలో ఎవరో కూడా బయటికి రాకూడదని నిత్యవసర సరుకులు అదేవిధంగా కూరగాయలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్లకే పంపించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది.ఇటువంటి నేపథ్యంలో విలక్షణ నటుడు కమల్ హాసన్..సరికొత్త ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారంటే వైరస్ ఎక్కువగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎల్డామ్స్ రోడ్ లో ఉన్న తన ఇంటిని తాత్కాలిక ఆసుపత్రిగా మార్చబోతున్నట్లు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడుతున్నట్లు ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా నా ఇంటిని హాస్పిటల్ చెయ్యాలని అనుకుంటున్నట్లు కమలహాసన్ పేర్కొన్నారు.

 

దీనికి తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో కమల్ హాసన్ నిర్ణయానికి సోషల్ మీడియాలో చాలా మంది ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంత మంది నెటిజన్లు అయితే…సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా చేయలేనిది నువ్వు చేసావు కమల్ హాసన్ శభాష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version