రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం గట్టిగా కనబడుతున్న నేపథ్యంలో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. దేశ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు లాక్ డౌన్ గట్టిగా పాటిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా నెలకొన్న పరిస్థితుల గురించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఈ సంక్షోభాన్ని అధిగమిస్తే ఖచ్చితంగా ప్రపంచంలో భారత్ సూపర్ పవర్ కంట్రీ అవుతుందని నెంబర్ వన్ మనమే అంటూ ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అభివృద్ధి చెందిన దేశాలు గజగజ వణికిపోతున్నాయి ఈ వైరస్ కి. అయితే ఇటువంటి సమయంలో భారతీయులుగా మనం ఇల్లు వదిలి బయటకు రాకుండా దేశభక్తిని చాటుకోవాలని పేర్కొన్నారు.
ప్రస్తుత కాలములో సమాజమంతా సరైన క్రమశిక్షణ పాటించి దూరంగా ఉంటే ప్రపంచం ఆశ్చర్య పోయే స్థాయికి ఖచ్చితంగా చేరుకోగలం అని విశ్లేషించారు ఉండవల్లి. భారత్ కి స్వాతంత్ర్యం ఇచ్చేముందు ప్రపంచ మేధావిగా అందరిలో గుర్తింపు పొందిన చర్చిల్ కుక్కలతో పోల్చాడు. ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు తిప్పికొట్టే రోజులు వచ్చాయి. మనం స్వీయ నియంత్రణ పాటిద్దాం కుక్కలు ఎవరో తేలుద్దాం అన్నారు ఉండవల్లి అరుణ కుమార్. దీంతో ఉండవల్లి చేసిన కామెంట్లు మెచ్చుకోళ్లు విమర్శలు ఘాటైన డైలాగులు సోషల్ మీడియాలో నెటిజన్లు అదరగొట్టాయి అని అంటున్నారు.