Breaking : రగులుతున్న మాస్టర్‌ ప్లాన్‌ మంట.. రేపు అత్యవసర సమావేశం

-

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ మంట రగులుతోంది. ఇప్పటికే బాధితులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో రేపు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరగనుంది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై చర్చించి.. దాన్ని రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివాదాస్పదంగా మారిన కామారెడ్డి మున్సిపల్ ముసాయిదా మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామాలు చేయాలంటూ రైతులు, స్థానికులు డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన పలువురు కౌన్సిలర్లు రాజీనామాలు చేసి, రైతులకు మద్దతుగా నిలిచారు.

అధికార పార్టీ కౌన్సిలర్లు కూడా రాజీనామాలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు రేపు కామారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్థన్ ఇల్లు ముట్టడికి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం శుక్రవారం నిర్వహించాలని నిర్ణయించారు. రైతులతో పాటు స్థానిక ప్రజల నుంచి మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు రావడంతోనే మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారనే చర్చ సాగుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కామారెడ్డి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్ లో అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version