అవినీతికి పరాకాష్ట కేసీఆర్‌ ప్రభుత్వం.. బూర నర్సయ్య గౌడ్ సంచలనం

-

నిన్న ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సభపై ఇబ్రహీంపట్నం లో మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకులు బుర్ర నర్సయ్య గౌడ్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్పీచ్ లో పస లేదు… బీఆర్ఎస్‌ కు బస లేదన్నారు. అంతేకాకుండా.. అవినీతికీ పరాకాష్టగా ఉన్న కెసిఆర్ ప్రభుత్వం, ఖమ్మం సభ ఖర్చు 300కోట్లు, ఏపీ BRS అధ్యక్షుడికీ కట్టబెట్టిన భూమి కమిషన్ తో పెట్టిన సభ అది. కార్లమార్స్ సిద్ధాంతం సైతం అమ్ముకున్న కమ్యూనిస్ట్ నాయకులు. 9 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో చేసింది ఏముంది. రాజకీయాలకు బర్గర్లకు పొంతన ఏముంది.? ముఖ్యమంత్రి బి ఆర్ యెస్ పార్టీని స్థాపించడం ప్రజలకు ఇచ్చిన వాక్ దానాలను కప్పిపుచ్చుకునేందుకే పార్టీ ఏర్పాటు చేశాడు. కమ్యూనిస్టు లు దిగజారి బీఆర్‌ఎస్‌ తో పొత్తు కేవలం స్వలాభం కోసమే.

ఎన్నికల కోసమే కంటి వెలుగు అనేది 200 కోట్ల పెట్టండం ఈ పధకంలో ఏముంది. కంటి వెలుగు కేంద్రంలో ఏ ఒక్క కంటి డాక్టర్ లేడు. సరోజిని దేవి ఆసుపత్రిలో సంవత్సరానికి కేవలం 9000 వేల ఆపరేషన్ లు చేస్తున్నారు. గతంలో నాలుగు ఆసుపత్రిలను ఏర్పాటు చేయాలని కోరడం తో పార్టీ నుండి నన్ను వెల్లగొట్టడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కల్పించి, కంటికి సంబంధించి విభాగం ఏర్పాటు చేయాలి. దళితల మీద వివక్షత చూపుతున్న ముఖ్యమంత్రి …..ఇక్కడ ఇబ్రహీంపట్నం లో మార్కెట్ కమిటీ చైర్మన్ ను దాదాపు మూడు సంవత్సరాలు కాలయాపన చేయడం జరిగింది.’ అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version