మాట ఇస్తే చేసి చూపించే వ్యక్తి కామినేని శ్రీనివాసరావు: విక్టరీ వెంకటేశ్‌

-

విక్టరీ వెంకటేశ్‌ మరోసారి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేడు కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరఫున ఏలూరు జిల్లా కలిదిండి మండలం పడమటిపాలెం కైకలూరు గాంధీ బొమ్మ కూడలి వరకు వెంకటేశ్‌ రోడ్ షో నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన విక్టరీ వెంకటేశ్‌ విజ్ఞప్తి చేశారు.

మంచి తనానికి మారు పేరు, మాట ఇస్తే చేసి చూపించే వ్యక్తి కామినేని శ్రీనివాసరావు అని వెంకటేశ్‌ అన్నారు. శ్రీనివాస్ గారిని తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెంకీ వచ్చాడని తెలియడంతో అభిమానులు భారీగా తరలి వచ్చారు. వెంకటేశ్ చేయి ఊపుతూ అభిమానులను అలరించారు. ఇందుకు సంబందించిన వీడియోస్, ఫొటోస్ నెట్టింట్లా వైరల్ అవుతున్నాయి.కాగా, మంగళవారం (మే 7) ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా వెంకటేష్ ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే.ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి.. వెంకీకి వియ్యంకుడు అన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version