ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ కనక దుర్గమ్మ ఫ్లై ఓవర్ ఎట్టకేలకి ప్రారంభం అయింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు ఏపీ సీఎం జగన్ లు ఈ ఫ్లై ఓవర్ ను వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో దశాబ్దాలుగా విజయవాడ ప్రజలు ఎదురు చూస్తున్న కల సాకారమైందని చెప్పచ్చు. 2.6 కి.మి పొడవు తో వంపులు తిరుగుతూ ఉన్న దుర్గగుడి ఫ్లై ఓవర్ దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పచ్చు.
ఈ ఫ్లై ఓవర్ దసరా ముందుగా వినియోగంలోకి రావడం ద్వారా విజయవాడలో చాలా వరకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు. ఒకవైపు క్రష్ణమ్మ , మరోవైపు దుర్గమ్మ.. మధ్యలో ఒంపుసొంపులు తో ఉన్న ఫ్లైఓవర్ పర్యాటక ప్రదేశంగా మారుతుందని కూడా చెప్పచ్చు. గతంలో పలు మార్లు ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభించాలని చూశారు కానీ అనివార్య కారణాల వలన ప్రారంభోత్సవం వాయిదా పడింది. నితిన్ గడ్కరీ కరోనా నుండి కోలుకున్న తర్వాత ఈరోజు ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు.