కందనూలు లో ఫ్లెక్సీ వార్..!

-

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీలో బడానేతల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ టిపిసిసి అధ్యక్షుడు మాజీ ఎంపీ ప్రస్తుత ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లు రవికి చెందిన ఇద్దరు నేతల ఫ్లెక్సీలు నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఆశావాహులంతా ఇప్పటికే ఎంపీ టికెట్ కోసం దరఖాస్తులు చేయడం జరిగింది.

దీనిపై హై కమాండ్ అభ్యర్థులు దరఖాస్తులను స్క్రూట్ నిర్వహించి ప్రధానంగా ముగ్గురికి ఫైనల్ చేశారు వీరిలో ఇద్దరు ఆశావాహులు గ్రౌండ్ లెవెల్ ప్రచారం ముమ్మరం చేశారు భారీ పోస్టర్లు ఫ్లెక్సీలు అని ఏర్పాటు చేసి నువ్వా నేనా అని ప్రచారం మొదలుపెట్టారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నేతల్లో జోరుగా చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version