భయం పుట్టేలా చేయ బోతున్న కంగనారనౌత్‌..!!

-

బాలీవుడ్  హీరోయిన్ కంగనారనౌత్‌ గురించి మీడియా తో టచ్ ఉన్నవారికి పరిచయం లేదు. ఆమె పేరు లేకుండా ఏ ఒక్క రోజు కూడా వార్తలు రావంటే అతిశయోక్తి కాదు. ఆమె ప్రతిభతో మరియు వివాదాలతో మీడియాలో రోజూ నానుతూ ఉంటారు. ఆమె ఇప్పుడు భారత దేశంలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. అలాంటి ఫైర్ బ్రాండ్ అందరినీ భయ పెట్టడానికి రెడీ అయ్యింది.

గతంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా చంద్రముఖి. 2005 లో రిలీజ్ అయిన ఈ హారర్‌ కామెడీ మూవీ తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ హిట్ సినిమా సీక్వెల్ లో రజనీ కాంత్ కు బదులుగా రాఘవ లారెన్స్‌ హీరోగా ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. చంద్రముఖిని తెరకెక్కించిన పి.వాసు నే ఈ సినిమా కు డైరెక్షన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో జ్యోతిక చేసిన పాత్రకు మంచి ప్రశంశలు వచ్చాయి. ఆ పాత్రలో జ్యోతిక చాలా భయపెట్టింది. మళ్లీ అలాంటి ఇంపాక్ట్ రావాలంటే చంద్రముఖి పాత్రలో ఎవరిని తీసుకోవాలి అని చాలా రోజలుగా ఆలోచన లో పడ్డారు.తాజాగా ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్‌ తార కంగనారనౌత్‌ ను ఎంపిక చేశారు. ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా ఫైర్ బ్రాండ్ లాగానే ఉంటుందని అంటున్నారు. నిజమైన ఫైర్ బ్రాండ్ కు అలాంటి పాత్ర వస్తే చెలరేగి పోతుంది. ఈ క్యారెక్టర్ ప్రధానాకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు

 

Read more RELATED
Recommended to you

Exit mobile version