చంద్రముఖి 2 షూటింగ్ షూరు.. ఫొటోస్ షేర్ చేసిన కంగనా

-

బాలీవుడ్ క్వీన్ కంగనా రనోత్ ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వెదికగా పంచుకుంది ఈ భామ..

బాలీవుడ్ బ్యూటీ, ఫైర్ బ్రాండ్ కంగనా ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా 2005లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చంద్రముఖి 2 లో నటిస్తుంది కంగనా.. ఇందులో కంగనా ప్రధాన పాత్రలో రాజనర్థకిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుండగా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ వస్తుంది ఈ హీరోయిన్.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్ పూర్తి కాగా ప్రస్తుతం మిగతా భాగం షూటింగ్ జరుగుతుంది. కాగా ప్రస్తుతం సినిమాలో కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పలు ఫోటోలు కంగనా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

 

వ్యానిటీ వాన్ లో మేకప్ వేసుకుంటూ రెడీ అవుతున్న ఫోటోలు పంచుకుంది కంగనా. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ కమెడియన్ వడివేలు సైతం సినిమాలో మరో ప్రధాన పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి. వాసునే చంద్రముఖి 2కు దర్శకత్వం వహిస్తున్నారు..

ప్రస్తుతం కంగనా చంద్రముఖి 2 సినిమాతో పాటు మణికర్ణిక రిటర్న్స్, టీకు వెడ్స్ షేరు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా కంగనా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన సినిమాలకు షూటింగ్ సంబంధించిన పలు ఆసక్తికర విషయాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు పంచుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే..

Read more RELATED
Recommended to you

Exit mobile version