మన రాష్ట్రంలో ఉల్లిపాయలను ఫ్రెష్ గా కట్ చేసి వంట చేస్తారు.. అదే కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దేశాల్లో అయితే డ్రై అనియన్స్ ను ఎక్కువగా వాడతారు..రోజు ఉల్లిని కోసి వండే టైమ్ వాళ్లకు ఉండదు..విదేశాల్లోనైతే… ఉల్లిని వాడేవారు తక్కువ. అక్కడ ఉల్లి పొడి వాడుతారు. అదే ఈ బిజినెస్. మీరు ఉల్లి పొడిని తయారుచేసి నష్టాలు లేకుండా మంచి సంపాదనను పొందవచ్చు..మన దేశంలో ఉల్లికి ఎక్కువ ధర లేదు.. అందుకే ఈ బిజినెస్ చెయ్యడానికి చాలా మంచిది…మార్కెట్ నుంచి కాకుండా నేరుగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తే తక్కువ ధరకే ఉల్లిపాయలు దొరుకుతాయి..
ఇక రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వగలరు, మీకు కూడా తక్కువ ధరకు ఉల్లి లభిస్తుంది. ఈ ఉల్లితో మీరు.. ఉల్లి ఫ్రై, ఉల్లి పొడి చెయ్యవచ్చు..దేశంలో ప్రతి సంవత్సరం 20 నుంచి 25 శాతం ఉల్లి కుళ్లిపోతుంది లేదా అలాగే ఉండిపోతుంది. కుళ్ళిన లేదా నిల్వ ఉల్లిపాయలను ఆహారంలో తీసుకుంటే శరీరంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఆరోగ్యం దెబ్బతినగలదు.. అందుకే వాటి నుంచి నీటిని తీసివేసి పొడి చేస్తేఅది పాడవదు. దానికి మంచి ధర కూడా వస్తుంది.. ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్ ను తింటున్నారు.. వాటికి ఉల్లి పొడిని ఎక్కువగా వాడుతున్నారు..ఉల్లిపాయ పొడి చేయడానికి, మీరు మొదట ఉల్లిపాయను తొక్క తీసి, శుభ్రం చేయాలి. దానిని ముక్కలుగా కట్ చేసి, ఆపై మీరు భారీ ఉత్పత్తి కోసం సౌరశక్తితో పనిచేసే సన్‌డ్రైయర్ లేదా ఎలక్ట్రిక్ పవర్డ్ డ్రైయర్‌లో ఆరబెట్టండి. ఇది ఉల్లిపాయ నుంచి మొత్తం నీటిని తీసివేస్తుంది..
తేమ పూర్తిగా ఆవిరైన తర్వాత ఉల్లిపాయ ఎక్కువ కాలం చెడిపోదు. మీకు కావాలంటే ఈ డీహైడ్రేటెడ్ ఉల్లిపాయను ఎయిర్ టైట్ ప్యాకింగ్‌లో ప్యాక్ చేసి అమ్మవచ్చు. ముఖ్యంగా యూరప్, అమెరికాలో ఈ రకమైన ఉత్పత్తికి అధిక డిమాండ్ ఉంది…ఈ బిజినెస్ చేసే ముందే మార్కెట్ లో అలాగే ప్రముఖ హోటల్స్ తో టైఆప్ అవ్వడం మంచిది..వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు మొత్తం 600 చదరపు అడుగుల స్థలం అవసరం. దీన్ని మీరు 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకదాంట్లో ముడిసరుకును ఉంచవచ్చు, మరొకదాంట్లో డీహైడ్రేటర్ యంత్రం, గ్రైండర్‌ను ఉంచవచ్చు. మూడోదాంట్లో తుది ఉత్పత్తిని ఉంచవచ్చు.ఈ వ్యాపారానికి కావాల్సిన మిషన్లు, అలాగే మిగిలినవి కలిపి మీకు రూ.6లక్షల పెట్టుబడి అవుతుంది..అయితే ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ద్వారా మీరు ఆర్థిక సహాయం పొందవచ్చు.డీహైడ్రేట్ చేయడం వల్ల దాని పోషక విలువ పెరుగుతుంది. ఒక కిలో ఎండిన ఉల్లిపాయ 8 కిలోల మామూలు ఉల్లిపాయలతో సమానం. అంటే మీరు తక్కువ వాడకంతో కూడా మంచి రుచిని పొందుతారు.. వేరే దేశాలకు కూడా ఎగుమతి చేసి మంచి లాభాలను పొందవచ్చు.. మీకు బిజినెస్ ఆలోచన ఉంటే ఇది ట్రై చెయ్యండి.