కంగనా రనౌత్: బిల్కిస్ బానో మీద మూవీ తీస్తాను..కానీ..?

-

బిల్ కీస్ భాను రేప్ కేసులో గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన 11 మందిని జైలుకి పంపించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2 వారాల్లో జైలుకి తరలించాలని సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది 2002 గుజరాత్ అల్లర్లలో ఐదు నెలలు గర్భిణీ అయిన బిల్ కిస్ భాను పై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆమె మూడేళ్ల కూతురుతో పాటు ఏడుగురు కుటుంబ సభ్యున్ని కూడా హత్య చేశారు. ఈ కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు 11 మందిని దోషులుగా ఖరారు చేసింది. 2008లో జీవిత ఖైదును విధించింది తర్వాత బాంబే హైకోర్టు కూడా ఈ తీర్పుని సమర్థించింది.

తర్వాత తమను విడుదల చేయాలని కోరుతూ ఒక దోషి 2022లో సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే గుజరాత్ ప్రభుత్వాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కోరింది గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించి కమిటీ సిఫారసుల ఆధారంగా 11మందిని 2022 ఆగస్టు 15న విడుదల చేసారు. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గుజరాత్ ప్రభుత్వ తీరుని తప్పుపడుతూ సుప్రీంకోర్టు తిరిగే వాళ్ళని జైలుకు పంపించాలని ఆదేశించింది ఒక సోషల్ మీడియా యూజర్ బిల్ కిస్ భానుపై సినిమా తీస్తారా అని కంగానా ని అడగగా ఈ మూవీ తీయడానికి తన దగ్గర స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్న ఎవరూ నిర్మించడానికి ముందుకు రావట్లేదు అని చెప్పారు ఆమె నిజానికి మూడేళ్ల పాటు రీసెర్చ్ కూడా చేశారట ఓటిటి ప్లాట్ఫారం కూడా ముందుకు రావట్లేదని కంగనా అన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version