బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు, ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సమావేశం అయ్యారు. వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై వినతిపత్రం ఇచ్చామని కన్నా తెలిపారు. లక్షలాది కార్మికులు బజారున పడ్డా సీఎంలో చలనం లేదని మండిపడ్డారు. జగన్ మాటలకు చేతలకు సంబంధం లేదని ఆరోపించారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయడం లేదని, ఆలయ భూములను సొంత భూముల్లా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇసుక దొరకక కార్మికులు ఉపాధి కోల్పోయారని, ఇసుకను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే జగన్‌పై సంలచన వ్యాఖ్యలు చేస్తు మండిపడ్డారు.