సొంత బిడ్డను రూ.60 వేలకు అమ్ముకున్న కన్న తల్లి.. విచారణలో విస్తుపోయే నిజాలు!

-

తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా.. భువనగిరి ఏరియా లో ఒక యువతి తనకు పుట్టిన బిడ్డను 60 వేల రూపాయలకు అమ్ముకుంది. ఈ నెల 12వ తారీఖున ఆమె ఓ ఆస్పత్రిలో ఓ పసికందుకు జన్మనిచ్చింది. అయితే కేవలం పది రోజులకే తన బిడ్డను తెలిసిన వారి సహాయంతో భువనగిరి శివారులోని ఎల్లమ్మ గుడి సమీపంలో.. ఘట్‌కేసర్‌ మండలం ఎదులబాద్‌కు చెందిన వారికి 60 వేల రూపాయలకు విక్రయించారు.

విస్తుపోయే నిజమేమిటంటే.. ఆ యువతి పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ లోని నేరేడ్‌మెట్‌ ప్రాంతం లోని తమ నివాసంలో జీవిస్తున్న ఆమెపై ఒకరు అత్యాచారం చేశారు. దాంతో కొన్ని నెలల తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఆపై బాధిత కుటుంబ సభ్యులు నేరేడ్‌మెట్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా రేప్ కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే విచారణ భాగంలో డిఎన్ఏ టెస్ట్ కోసం బిడ్డను తీసుకురావాలని పోలీసులు కోరగా… బిడ్డ చనిపోయిందని బాధితురాలు చెప్పింది. దాంతో షాకైన పోలీసులు వారిని గట్టిగా నిలదీయడంతో బిడ్డను విక్రయించినట్లు పోలీసులకు తెలిసింది. దాంతో బిడ్డను విక్రయించినందుకుగాను ఆమె పై, కుటుంబ సభ్యుల పై కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే విక్రయించబడిన బిడ్డను చైల్డ్ కేర్ సెంటర్ కి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version