కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన వీరేంద్ర బాబును తాజాగా కొడిగె హళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో కన్నడ సినిమా పరిశ్రమ షాక్ కు గురి అయింది, పూర్తి వివరాల్లోకి వెళితే కర్ణాటక లో ఒక మహిళ వీడియో సాక్ష్యంతో సహా బయటపెట్టడంతో వీరేంద్ర బాబు దొరికిపోయాడు. ఈ మహిళను వీరేంద్ర బాబు తెలియని స్థితిలో ఉండగా ఆ నిస్సహాయ స్థితిని వాడుకుని 2021 లో తనను అత్యాచారం చేశాడని, అదే సమయంలో వీడియో కూడా తీశాడని ఆమె పోలీస్ లకు చెప్పింది. అంతే కాకుండా కొంతకాలం తర్వాత ఆ వీడియోను చూపిస్తూ రూ. 15 లక్షలు డబ్బు ఇవ్వాలని లేకుంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆమె పోలీసుల ముందు చెప్పింది.