రాజకీయాల్లోకి హీరో విజయ్.. ముహూర్తం..?

-

కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న విజయ్… కొన్ని రోజుల నుంచి పలు రాజకీయ వివాదాలలో నానుతూనే ఉన్న విషయం తెలిసిందే. గతంలో సినిమా షూటింగ్ లను బిజెపి అడ్డుకోవడం సంచలనంగా మారింది. ఆ తర్వాత స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఇక ఆ తర్వాత ఈ ప్రచారం కాస్త సద్దుమణిగింది. కానీ మళ్ళీ కోలీవుడ్ వర్గాల్లో ఇలాంటి ప్రచారం మొదలైంది. త్వరలో హీరో విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అన్న ప్రచారం ప్రస్తుతం ఊపందుకుంది.

అయితే దీని వెనుక కారణం కూడా లేకపోలేదు. ఇటీవలే స్టార్ హీరో విజయ్ తన అభిమాన సంఘాలతో వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తుండడం దీనికి కారణం. 2021 సంవత్సరం లో తమిళనాడు లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అన్న చర్చ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఏ పార్టీలో చేరకుండా కొత్త పార్టీ తోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తారు అన్న చర్చ కూడా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version