పాక్ సైన్యం పై తాలిబన్ల దాడి.. 16 మంది మృతి

-

పాకిస్తాన్ సైన్యం పై పాక్ తాలిబన్లు ఘోరమైన దాడి చేశారు. మొత్తం 16 మంది పాక్ సైనికులను హత మార్చారు. అప్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆర్మీ ఔట్ పోస్టు పై తాలిబన్లు రాత్రి పూట మెరుపు దాడి చేశారు. మొత్తం 30 మంది ఉగ్రవాదాలు ఆర్మీ ఔట్ పోస్టు మూడు వైపుల నుంచి రెండు గంటల పాటు దాడి చేశారని పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొంటున్నారు. దాడి అనంతరం చెక్ పాయింట్ వద్ద ఉన్న వైర్ లెస్ కమ్యూనికేషన్ పరికరాలను, పత్రాలను ఇతర వస్తువులను తాలిబన్లు తగులబెట్టారు.

అప్గాన్ సరిహద్దుకు 40 కి.మీ. దూరంలో ఉన్న ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్ లోని మాకిన్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. తమ సీనియర్ కమాండర్ల బలిదానాలకు ప్రతీకారంగా ఈ దాడి జరిపినట్టు తాలిబన్లు ఓ ప్రకటన కూడా విడుదల చేసారు. ముఖ్యంగా 2021లో తాలిబన్లు అప్గనిస్తాన్ లో అధికారంలోకి వచ్చిన తరువాత పాక్ తాలిబన్లు పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. –

Read more RELATED
Recommended to you

Exit mobile version