అల్లు అర్జున్ శనివారం రాత్రి మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ఇది ఒక యాక్సిడెంట్.. ఇందులో ఎవరి తప్పు లేదన్నారు. హాస్పిటల్ లో ఉన్న బాలుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. పర్మిషన్ లేకుండా వెళ్లానని అంటున్నారు. కచ్చితంగా అది తప్పుడు సమాచారం అని..నేను కష్ట పడిందే తెలుగువాళ్ళ పేరు నిలబెట్టడానికి.. అలాంటిది ఒక నేషనల్ మీడియా ముందు నా గురించి తప్పుడు ఆరోపణలు చేస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది” అని తెలిపారు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సంధ్య థియేటర్ వద్ద అభివాదం చేస్తూ వెళ్లడం.. పోలీసులు అనుమతి ఇచ్చారా..? లేదా అనేది ఆయనకు కూడా తెలుసని అన్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని తెలిపారు. పోలీసుల నుంచి సమాచారం తీసుకున్న తరువాతనే అల్లు అర్జున్ స్పందించారని తెలిపారు. అల్లు అర్జున్ మానవీయ కోణం మరిచిపోయారు అని సీఎం బాధతో చెప్పారు. చనిపోయిన సోదరి కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉండేదని తమ ఆలోచన అన్నారు. శ్రీతేజ ను బతికించాలనేది తమ తాపత్రయం అన్నారు. సినీ ఇండస్ట్రీ పెద్దలు బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని కదా అనేది సీఎం ఆలోచన అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.