కరాటే కళ్యాణి – శ్రీకాంత్ రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్

-

కరాటే కళ్యాణి వద్ద ఉన్న మసాలా చిన్నారి పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే.. శ్రీకాంత్ రెడ్డి-కళ్యాణి కేసులో తెరపైకి మరో ట్విస్ట్ వచ్చింది. కరాటే కళ్యాణి చిన్నారిని అక్రమంగా దత్తతకు తీసుకుందనీ చైల్డ్ లైన్ హెల్ప్ డెస్క్ 1098 కు ఫిర్యాదు అందింంది. కళ్యాణి వద్ద ఉన్న చిన్నారి చట్ట బద్దంగానే దత్తత తీసుకుందా ? చిన్నారిని కల్యాణికి అపగించింది ఎవరు ? ఎవరీ మధ్యవర్తిత్వం ద్వారా ఎక్కడి నుండి కళ్యాణి చిన్నారిని తెచ్చుకుందా అనే దానిపై విచారణ చేశారు.

అయితే ప్రాథమికంగా చిన్నారినీ కళ్యాణి అక్రమంగా దత్తతకు తీసుకున్నట్లు గుర్తించారు చైల్డ్ లైన్ అధికారులు. గతంలోనూ ఓ బాబును శ్రీకాకుళం నుండి దత్తత తీసుకున్న కళ్యాణి… ఇప్పుడు బాబు వయస్సు 12 సంవత్సరాలని గుర్తించారు.

బాబు బందువుల ఇంట్లో ఉన్నట్లు చైల్డ్ లైన్ అధికారులకు తెలియజేశారు కళ్యాణి తల్లి విజయ లక్ష్మి.
కళ్యాణి ఏ విధంగా నెలల మసాలా చిన్నారులను దత్తత తీసుకుంటుంది ఎందుకు తీసుకుంటుంది చైల్డ్ లైన్ అధికారులకు స్పష్టత రాలేదు. చైల్డ్ లైన్ ఆఫీసర్స్ కీ ఇప్పటి వరకు కాంటాక్ట్ లోనికి రాని కళ్యాణి… నిన్న చైల్డ్ లైన్ & పోలీసులు వచ్చిన సమయంలో ఇంట్లో లేదు. నిన్న సంగారెడ్డి టెంపుల్ కి పాపను తీసుకు వెళ్లింది కల్యాణి. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version