అమ్మో.. కుమారుడి డైపర్స్ కోసం కోటిన్నర ఖర్చు చేస్తోన్న బాలీవుడ్ దంపతులు

-

బాలీవుడ్ ప‌వ‌ర్ క‌పుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ల గురించి తెలియ‌ని వారుండ‌రు. అయితే స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ల కుమారుడు తైమూర్ అలీ ఖాన్ ఇంత చిన్న వయసులో ప్రతి రోజు వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి ఫొటోలు పదే పదే వైరల్ అవుతుంటాయి. దీంతో తైమూర్‌కి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. తమ ముద్దుల కుమారుడు తైమూర్ డైపర్ల కోసం సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ చేస్తోన్న ఖర్చుకు సంబంధించిన ఓ విషయం తాజాగా బయటకు వచ్చింది.

ఓ డైప‌ర్ కంపెనీతో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ కోటిన్న‌ర రూపాయ‌ల డీల్ కుదుర్చుకున్నారట. తైమూర్ కోసం ఆ కంపెనీ ప్ర‌త్యేకంగా డైప‌ర్లు తయారు ఇస్తుందట. ఆ బాలుడి కేర్ టేక‌ర్‌కు నెల‌కు ల‌క్ష‌న్న‌ర రూపాయ‌ల‌ను ఆ దంపతులు చెల్లిస్తుంటారు. కుమారుడిపై వారు చూపిస్తోన్న శ్రద్ధ హాట్ టాపిక్‌గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version