కర్ణాటక సీఎం : బీజేపీ ఎమ్మెల్యేలకు పదవి ఆశ చూపిస్తున్న కాంగ్రెస్ !

-

ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికలకు సంబంధించిన విషయం పైన ఇప్పటి నుండే ఎత్తులు పై ఎత్తుల గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కాగా కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ నుండి కర్ణాటక సీఎంగా బసవరాజ్ బొమ్మై ఉన్నారు. తాజాగా బోమ్మై మాట్లాడుతూ మే నెలలో జరగనున్న ఎన్నికలలో ఎలాగైనా ప్రతిపక్ష కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

అందులో భాగంగా బీజేపీ నాయకులను ప్రలోభాలకు గురి చేస్తూ తమ పార్టీ లోకి లాక్కునేందుకు పన్నాగాలు పన్నుతోందని సీఎం అన్నారు. అంతే కాకుండా కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ స్వయంగా బీజేపీ ఎమ్మెల్యే లకు ఫోన్ లు చేస్తూ… పదవి ఆశ చూపిస్తూ వల పన్నుతున్నారని మాట్లాడారు. అయితే ఎన్నికలకు మరో నెల మాత్రమే సమయం ఉన్నందున ఎవరు ఈసారి అధికారంలోకి రానున్నారు అన్నది తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే. దీనిపై డీకే శివరాజ్ కుమార్ ఏమైనా స్పందిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version