ఐపిఎల్ ఓపెనింగ్ కు హాజరు కానున్న సినీ తారలు వీరే ? !

-

మార్చ్ 31 వ తేదీ నుండి ఇండియా వేదికగా క్రికెట్ ప్రేమికులు అందరూ ఎంతగానో ఆదరించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 2023 ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో ఎప్పటిలాగే 10 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్ళు తమ తమ కోచ్ లతో కలిసి ప్రాక్టీస్ ను మొదలుపెట్టారు. కొన్ని ఫ్రాంచిజీలలో ఆటగాళ్ళు గాయాలతో ఈ సీజన్ కు దూరం కావడంతో… వారికి ప్రత్యామ్నాయంగా కొందరి ఆటగాళ్లను భర్తీ చేసుకున్నాయి. ఇక రేస్ కు సమయం ఆసన్నమైంది. కాగా ఈ మ్యాచ్ లు ఆరంభానికి ముందుగా నిర్వహించే ఓపెనింగ్ సెరేమనీని ఈ సారి కూడా ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు ఐపిఎల్ పాలక మండలి.

అయితే ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మరియు బాలీవుడ్ ల నుండి పలువురు సెలబ్రిటీలు వచ్చి ఆడిపాడనున్నారు. ఇంతకీ రానున్న ఆ సెలబ్రిటీలు ఎవరన్నది ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ నుండి సూపర్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, ప్రముఖ నటి కత్రినా కైఫ్, సింగర్ అరిజిత్ సింగ్ లు రానున్నారు. అదే విధంగా టాలీవుడ్ నుండి రష్మిక మందన్న మరియు తమన్నా భాటియాలు వచ్చి ఈ ప్రోగ్రాం ను ఆటపాటల మధ్యన స్టార్ట్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version