దిమ్మతిరిగేలా ప్రతిపక్షాలపై ఫైర్ అయిన ప్రధాని మోదీ !

-

గత కొన్ని రోజుల నుండి దేశ రాజకీయాలు హీటు మీద ఉన్నాయి. లోక్ సభ లో రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం దగ్గర నుండి తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ లీడర్ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేయడం , ఆ తర్వాత వ్యాఖ్యలకు కేటీఆర్ రివర్స్ కౌంటర్ ప్రధాని మోదీని ఉద్దేశించి లోపర్ అంటూ అమానుష వ్యాఖ్యలు చేయడంతో హాట్ హాట్ గా రాజకీయాలు ఉన్నాయి. వీటన్నిటినీ నిశితంగా పరిశీలిస్తూ వచ్చిన ప్రధాని మోదీ ఒక్కసారిగా ప్రతిపక్ష పార్టీలపై ఫైర్ అయ్యారు.

మోదీ మాట్లాడుతూ అవినీతి పరులు అంతా ఒక దగ్గరకు వస్తున్నారని.. ఇంతకు ముందు జరగిన అవినీతిని బీజేపీ ప్రభుత్వం కూకటి వేళ్ళతో పెకిలించింది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి 5 వేల కోట్లు అవినీతి డబ్బు మాత్రమే బయట పెట్టగలిగారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల అవినీతి సొమ్మును బయట పెట్టాము అంటూ చెప్పారు. ప్రభుత్వాలను మరియు బ్యాంకు లను కోసం చేసి దేశాలను వదిలి పారిపోయిన 20 వేల ఆర్థిక నేరగాళ్లను అరెస్ట్ చేశాం అంటూ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version