కాస్త నిర్లక్ష్యంగా ఉండి.. కరోనా నిభందనలు పాటించకుంటే కరోనా కనికరం చూపించదు. వ్యాక్సిన్ వేసుకున్న మళ్లీ అటాక్ చేసే అవకాశం ఉంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే కర్ణాటక ధార్వాడ్ లోని ఎస్డీఎమ్ వైద్య కళాశాలతో చోటు చేసుకుంది. ఇటీవల ఈ కళాశాలలో వైద్య విద్యార్ధులకు ఒక్కసారిగా కోవిడ్ సోకింది. బాధితులంతా వ్యాక్సినేషన్ చేయించుకున్నా.. కరోనా సోకడం కలవరపరిచింది. తాజాగా కోవిడ్ బారిన పడ్డ విద్యార్ధుల సంఖ్య 281కి చేరింది. ఇంకా 1,822 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది. దీంతో మరెంత మంది కోవిడ్ బారిన పడుతారో తెలియాల్సి ఉంది.
ఇటీవల కాలేజ్ లో జరిగిన ఓ ప్రెషర్ పార్టీనే ఇంత పెద్ద సంఖ్యలో మెడికల్ స్టూడెంట్లకు కోవిడ్ సోకడానికి కారణమైంది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు. ప్రస్తుతం కరోనా నిర్ధరణ అయిన 281 మందిలో కేవలం ఆరుగురిలో మాత్రమే కొవిడ్ లక్షణాలు కనిపించాయని, మిగతా వారికి ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. విద్యార్థులందరినీ క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.