బిగ్ బాస్ హోస్ట్ గా మ‌రోసారి రమ్య‌కృష్ణ‌..!

-

బిగ్ బాస్ కు హిందీలోనే కాకుండా ఇప్పుడు త‌మిళ‌,తెలుగు భాష‌ల్లోనూ విప‌రీత‌మైన క్రేజ్ ఏర్పడింది. ఇక తెలుగు లో హోస్ట్ గా నాగార్జున చేస్తుండ‌గా త‌మిళ బిగ్ బాస్ కు హోస్ట్ గా క‌మ‌ల్ హాస‌న్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ క‌రోనా భారిన‌ప‌డ్డారు. క‌మ‌ల్ హాస‌న్ కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో బిగ్ బాస్ కు హోస్ట్ గా ఎవ‌రు వ్యవ‌హ‌రిస్తారు అనేది ప్ర‌శ్న‌గా మారింది.

ramya krishna as biggboss host

ముందుగా క‌మల్ స్థానంలో ఆయ‌న కూతురు శృతి హాస‌న్ హోస్ట్ గా వ‌చ్చే అవ‌కాశం ఉందంటూ ప్ర‌చారం జ‌రిగింది. కానీ శృతి బిజీ షెడ్యూల్ కార‌ణంగా బిగ్ బాస్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోతుందట‌. దాంతో వీకెండ్ హోస్ట్ గా ర‌మ్య‌కృష్ణ‌ను సెట్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక తెలుగు బిగ్ బాస్ లోనూ ర‌మ్య‌కృష్ణ హోస్ట్ గా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. నాగార్జున త‌న పుట్టినరోజు సంధ‌ర్బంగా విహార‌యాత్ర‌ల‌కు వెళ్ల‌గా ఆ స‌మ‌యంలో ర‌మ్య‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించి ఆక‌ట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version