కర్ణాటక సీఎం ప్రమాణస్వీకారానికి విపక్షాలకు ఆహ్వానం

-

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్రంలోని విపక్ష నేతలను AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆహ్వానించారు. అలాగే సోనియా, రాహుల్, ప్రియాంకతోపాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు హాజరవుతారని తెలుస్తోంది. కాగా, నిన్న హైకమాండ్తో చర్చల అనంతరం డీకే, సిద్ధరామయ్య ఇవాళ సాయంత్రం బెంగళూరుకు చేరుకోనున్నారు.

ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి 7 గంటలకు కర్ణాటక సీఎల్పీ సమావేశం జరగనుంది. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను ఒప్పించడంలో కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయింది. సుదీర్ఘ చర్చల తర్వాత హైకమాండ్‌ హామీలకు డీకే అంగీకారం తెలిపారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు డీకే కోరిన శాఖలు ఇచ్చేందుకు హైకమాండ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు స్వీకరించినా ఐదేళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగే పరిస్థితి లేదు. పవర్ షేరింగ్ ఫార్ములాతో డీకేను కాంగ్రెస్ ఒప్పించింది. కర్ణాటక సీఎంగా మొదటి రెండేళ్లు సిద్ధరామయ్య, ఆ తర్వాత మూడేళ్లు సీఎంగా డీకే శివకుమార్‌ కొనసాగనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version