జపాన్‌లోని ఫేమస్ మ్యాగజైన్‌లో ఎన్టీఆర్‌, చరణ్

-

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా జపాన్‌లో ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఇంతటి అద్భుతమైన విజయాన్ని సాధించిన క్రమంలో.. RRR హీరోలైన పాన్ ఇండియా స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు అరుదైన అవకాశాన్ని పొందారు. మరి ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు కూడా నెగ్గిన ఈ చిత్రం జపాన్ దేశంలో అయితే 200 రోజులు కంప్లీట్ అయ్యినా కూడా రికార్డు వసూళ్లు కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపుతుంది.

ఇక జపాన్ లో అయితే రామ్ చరణ్ కి గాని ఎన్టీఆర్ కి గాని భారీ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇద్దరిపై అయితే లేటెస్ట్ గా జపాన్ కి చెందిన ప్రముఖ మ్యాగజైన్ ‘ఆనన్’ వారు అయితే వారిపై ఓ బ్యూటిఫుల్ పిక్ ని పొందుపరిచారు. మరి ఇద్దరు హీరోస్ కూడా తమదైన లుక్స్ తో అదరగొట్టగా వీరి లుక్స్ అయితే ఫ్యాన్స్ కి ఇప్పుడు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. దీనితో ఈ ఫేమస్ మ్యాగజైన్ పోస్టర్ వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version