కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య, ఆదిత్యలు మాట్లాడుకుంటూ ఉండగా..కార్తీక్ వచ్చి మమ్మీ పిల్లలు కనిపించటంలేదు అంటాడు. సౌందర్య..ఏంటి పెద్దోడా నువ్వు అస్థామానం వాళ్లధ్యాసేనా..బయటున్నారులే..హాస్పటల్ కి వెళ్తానన్నావ్ అంటుంది. వెళ్తున్నాను..వాళ్లతో కాసేపు మాట్లాడివెళ్ధాం అని అంటాడు. వాళ్ల గురించి ఎక్కువ ఆలోచించచుకురా అంటుంది సౌందర్య. మమ్మీ నువ్వు ఎదురుపడి పలకరించినా నేను మాట్లాడకుండా ముఖం తిప్పుకుని వెళ్లిపోతే నీకు ఎలా అనిపిస్తుంది అని కార్తీక్ అంటాడు. అక్కడితో ఆ సీన్ అయిపోతుంది.
కారులో దీప వస్తూ ఉంటుంది. వారణాసి.. అక్కా..ఆవిడ ఏమన్నారు అని అడుగుతాడు, దీప ఏం సమాధానం చెప్పదు. అక్కా ఆవిడతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లోపల ఏం జరిగిందో తెలియదుకానీ ఆవిడతో మీకు మంచి జరగలేదని అనిపిస్తుంది..రేపు నెలలు నిండి ఆవిడకు పాపోబాబు పుడితే..పుట్టిన బిడ్డను డైరెక్టుగా ఇంటికి పంపిస్తే నువ్వు ఏం చేస్తావ్ అక్కా..అని ఇవన్నీ నాకు వచ్చిన ఆలోచనలు కాదు. సరోజక్క చెప్పింది. నిన్ను జాగ్రత్తగా ఉండమంది అంటాడు. దీప..వారణాసి ముందుకు చూసి డ్రైవ్ చేస్తే మంచిదేమో అని..సరోజక్కకు ఒకమాట చెప్పు..బస్తీవాళ్లతో మా విషయాలు చర్చించటం ఆపేయ్ మను, నువ్వు కూడా వాళ్ల మాటలు వినకపోతే మంచిది..ఎక్కువగా ఆలోచించకపోతే మరీ మంచిది అంటుంది. వారణాసి సరే అక్కా అంటాడు.
ఇంట్లో శౌర్య ఆ పేపర్ గురించి ఆలోచిస్తూ..హిమ బాగా ఏడ్చింది, బాధపడింది అనుకుంటూ ఉంటుంది. ఇంతలో దీప వచ్చి ఒక్కదానివే ఇక్కడేం చేస్తున్నావ్ అని అడుగుతుంది. ఏం లేదు అని శౌర్య అంటుంది. హిమ ఎక్కడుంది అంటే ఇంట్లో ఉందని శౌర్య చెప్పి..హిమకు మళ్లీ జ్వరం వస్తుందేమో అంటుంది. ఏమైంది.. మీరు ఏం చెప్పరు మీ పాటికి మీరు అలుగుతారు అంటుంది దీప. శౌర్య ..దీప చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్తుంది. హాల్లో కార్తీక్ వాళ్లు కుర్చుని ఉంటారు. దీప నువ్వెళ్లు నేను మళ్లీ వస్తాను అంటుంది. శౌర్య వినదు హిమ దగ్గరకు వెళ్దాం రామ్మా..తను బాధపడుతుంది అంటుంది. దీప గట్టిగా అరుస్తుంది..వస్తాను అని చెప్తున్నాను కదా అంటుంది. దాంతో శౌర్య..కోపంగా ఈ ఇంట్లో పెద్దవాళ్లంతా బిసీనే..పిల్లలతో మాట్లాడే టైం ఏ ఉండదు ఎవరికి అని పైకి వెళ్లిపోతుంది. సౌందర్య పిలిచినా వినిపించుకోదు.
సౌందర్య ఏంటే ఏమైంది నీకు అంటుంది. కార్తీక్ వట్టి ఆపిల్స్ ఇస్తే ఏం సరిపోతుంది దీప..ఈసారి జ్యూసర్ తీసుకెళ్లి జ్యూస్ చేసి ఇచ్చిరా అంటాడు. ఆదిత్య ఏంటి వదినా..వెళ్లి చడామడా నాలుగు తిట్టి రావాలి కానీ..యాపిల్స్ తీసుకెళ్లటమేంటి అంటాడు. అది రాక్షసి కావొచ్చు..కానీ నేను కాదుగా, మంచిగా చెప్తే వింటుందేమో అనుకున్నాను అంటుంది దీప. ఆహా అది ఒట్టి రాక్షసి మాత్రమే కాదు..సైకో తను, పెద్ద సైకో అని కార్తీక్ అంటాడు. కోర్టులో ఎలా మాట్లాడిందో తెలిసికూడా నువ్వు తన దగ్గరకు వెళ్లావా అని కార్తీక్ అంటాడు..దీప ఇది సందర్భంకాదేమో కానీ మీకు ఒక విషయం చెప్పాలి డాక్టర్ బాబు అంటుంది. కార్తీక్ ఎటకారంగా…ఏంటో మానవత్వంతో తనకు సీమంతం కూడా ప్లాన్ చేస్తున్నావా అంటాడు. మనం చూసిన న్యూస్ పేపర్ కనిపించటంలేదు అని దీప అంటుంది. కార్తీక్ షాక్ అవుతాడు..తీసుకెళ్లినప్పుడే ఆ పేపర్ కాల్చేస్తే అయిపోయేది కదా అని అంటాడు. దీప జరిగింది చెబుతుంది. సౌందర్య పిల్లలు తీసి ఉంటారేమో అంటుంది. పిల్లలు తీస్తే..ఈపాటికే నిలదీసి ఉంటారుకదా అని కార్తీక్ అంటాడు. పేపర్ కనిపించకపోవటం కూడా మోనిత దగ్గరకు వెళ్లటానికి ఒక కారణం..ముగిసిందనుకున్నా అధ్యాయం మళ్లీ న్యూస్ పేపర్ రూపంలో మనల్ని భయపెడుతుంటే ఏడుస్తూ ఇంట్లో కుర్చోకోకుండా ఒక ప్రయత్నం చేయాలని మాత్రమే వెళ్లాను డాక్టర్ బాబు అని ఏడ్చుకుంటూ పైకి వెళ్లిపోతుంది. కార్తీక్ కుప్పకూలిపోతాడు. ఆదిత్య భయటకువెళ్తాడు. సౌందర్య, హాస్పటల్ కి వెళ్తానన్నావ్ కదా పెద్దోడా..అలా భయటకెళ్తొస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందేమో అంటుంది. అలా ఆ సీన్ అయిపోతుది.
ఇటువైపు జైల్లో ఉన్న మోనిత పడుకుని ఉంటుంది. సుకన్య వచ్చి పడుకుందేమో మళ్లీ వద్దాం అనుకుంటుంది. మోనిత సుకన్య ఏంటి ఇళా వచ్చి అలా వెళ్లిపోతున్నావ్ అని కాసేపు అలా మాట్లాడుకుంటారు..నాకొక హెల్ప్ చేసి ఇవ్వాలి అంటుంది మోనిత. సుకన్య చెవిలో ఏదో చెప్తుంది. సుకన్య అర్థమయింది..డ్రా చేసి ఇస్తాను పిన్ నెంబర్ చెప్పండి అంటుంది. మోనిత ఈ విషయం ఇంకెవరకి చెప్పకు అంటుంది. సుకన్య ఓవర్ యాక్షన్..వీరఫ్యాన్ ని ఎందుకు చెప్తాను అంటుంది.
మరోపక్క హిమ ఒక్కతే రూంలో ఉంటే..దీప వచ్చి ఏంటమ్మా ఒంట్లో బాలేదా అని అడుగుతుంది. హిమ..అమ్మ డాడీ మంచోడే కదా అని అడుగుతుంది. దీప డాడీ మంచోడమ్మా అంటుంది. మరి డాడీకి ఎందుకు కష్టాలొస్తున్నాయ్ అంటుంది. దీప మంచివాళ్లకే ఎక్కువ కష్టాలు వస్తాయ్ అమ్మా అంటుంది. హిమ..అందరితో బాగుండాలి, అందరికి మంచిచేయాలి అంటాడు మరి మంచివాళ్లకే కష్టాలేంటి అంటుంది. కొన్నిరోజులే కష్టాలు అని దీప అంటే..మరి మోనిత ఆన్టీ మంచిదా చెడ్డదా అని హిమ అడుగుతుంది. దీప కోపంతో ఇప్పుడు మోనిత గురించి ఎందుకు, ఇవన్నీ ఆలోచించి ఎందుకు బాధపడతావ్ అని దీప అంటుంది. హిమ..ఏది అడిగినా ఏదేదో చెప్పి కవర్ చేస్తావ్ అంటుంది. దీప నువ్వు ఇంకా ఆ షైనీ అన్న మాటలనే తలుచుకుని బాధపడుతున్నావా..నువ్వు మాట్లాడకపోయినా, బాధపడినా డాడీ ఎంత బాధపడతారో తెలుసుకదా అంటుంది. నేను కూడా డాడీ గురించే కదా ఆలోచిస్తున్నాను అంటుంది. దీప లేచి వెళ్లిపోతుంది. హిమ పిలిచి..డాడీ గురించి ఆలోచించవద్దంటావ్..నేను డాడీ దగ్గరే పెరిగాను కదా, డాడీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను అంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.